నీతి, నిజాయతీతో సేవ చేస్తాడని ఆశిస్తున్నా: కుమారుడి గురించి జేడీ లక్ష్మినారాయణ

  • సివిల్స్ లో సత్తా చాటిన లక్ష్మీనారాయణ కుమారుడు
  • 196వ ర్యాంకును కైవసం చేసుకున్న సాయి ప్రణీత్
  • సేవా ధృక్పథంతో పని చేయాలని కుమారుడికి లక్ష్మీనారాయణ సూచన
సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ కుమారుడు సాయి ప్రణీత్ సివిల్స్ పరీక్షల్లో 196వ ర్యాంకును సాధించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, తన తండ్రి గైడెన్స్, కృషి వల్లే తాను ఈ ఘనతను సాధించానని చెప్పారు. తన తండ్రి ఇచ్చిన స్ఫూర్తితో ట్రైనింగ్ పూర్తి చేసుకున్న తర్వాత ఒక సిన్సియర్ ఆఫీసర్ గా ప్రజలకు సేవ చేస్తానని అన్నారు.

మరోవైపు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, తన కుమారుడు సాధించిన విజయం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. నిజాయతీతో, ప్రజలకు నిస్వార్థంగా సేవలందిస్తాడని ఆశిస్తున్నానని చెప్పారు. తనకు అందుబాటులో ఉన్న వనరులన్నింటినీ ఉపయోగించుకుని... సివిల్స్ పరీక్షల్లో ప్రణీత్ విజయం సాధించాడని తెలిపారు. సేవా ధృక్పథంతో పని చేయాలని ప్రణీత్ కు సూచిస్తున్నానని చెప్పారు.
Go Back to Shorts
jd lakshminarayana
cbi
son
sai praneeth
civils

More Telugu News